ఉండవల్లి శ్రీదేవి కాదు… ఊసరవెల్లి శ్రీదేవి – మంత్రి అమర్నాథ్

-

ఉండవల్లి శ్రీదేవికి ఏపీ మంత్రి అమర్నాథ్ కౌంటర్‌ ఇచ్చారు. ఉండవల్లి శ్రీదేవి అనే కంటే ఊసరవెల్లి శ్రీదేవి అని మార్చుకుంటే బెటర్ అంటూ ఫైర్‌ అయ్యారు. సినీనటి శ్రీదేవి కంటే ఎమ్మెల్యే శ్రీదేవి నటన అద్భుతంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఎన్నికల రోజు ఓటు వేసి వచ్చిన తర్వాత అనుమానం కలిగింది…..తాను వైసీపీకి ఓటు వేశానని నమ్మించేందుకు నటించిందని పేర్కొన్నారు. ఊసర్ వెల్లులు అన్నీ పెద్ద ఊసర వెల్లి దగ్గరకు చేరుతున్నాయి….ఉండవల్లి శ్రీదేవి పసుపు కండువా కప్పుకుని జనంలోకి అప్పుడు అసలు సంగతి తెలుస్తుందని ఆగ్రహించారు.

ఓటుకు నోటు ఆఫర్ చేశారని ఎమ్మెల్యే రాపాకే చెప్పిన తర్వాత కొత్తగా చర్చ ఎందుకు అని ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్. చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు….ఎమ్మెల్యేల కొనుగోళ్ల లో చంద్రబాబు తీరులో మార్పు లేదు….సాధారణ ఎన్నికల్లో గెలుపు వైసీపీదేనన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version