మోడీ చేతుల మీదుగా అల్లూరి విగ్రహవిష్కరణ జరగడం సంతోషంగా ఉంది: నారా లోకేష్

-

నేడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మోడీ నేడు ఏపీకి వస్తున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు మోడీ. భీమవరానికి సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో జరిగే భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు మోడీ.

అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అల్లూరి విగ్రహావిష్కరణ జరగడం ఒక తెలుగువాడిగా సంతోషంగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అమాయక గిరిజనం నిరంకుశ పాలకుల చేతుల్లో నలిగిపోతుంటే.. వారిలో అల్లూరి ధైర్యం నింపి నిప్పు కణాల్లా మార్చారన్నారు. స్వాతంత్ర పోరులో ధ్రువ తారల మెరిసి బ్రిటిష్ వారి గుండెల్లో దడ పుట్టించిన మన్యం వీరుడు అల్లూరిని ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా స్మరించుకోవడం మనకు గర్వకారణమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version