ఒక్కరోజు సీఎం.. సినిమాలో కాదు నిజమే !

-

అర్జున్ ఒకే ఒక్కడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో ఒక్క రోజు ముఖ్యమంత్రిగా అర్జున్ మంచి పనులు చేసి ఏకంగా నిజమైన సీఎం అవుతాడు. ఇప్పుడు అలంటి సీన్ నిజంగా జరిగింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఒక్క రోజు ముఖ్యమంత్రి గా సృష్టి గోస్వామి అనే యువతి ఈరోజు బాద్యతలు చేపట్టింది. నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు సృష్టి గోస్వామి నిర్వర్తించనున్నారు.

డెహ్రాడూన్‌లో జరిగే చైల్డ్ అసెంబ్లీ సెషన్లోనూ సృష్టి పాల్గొననున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్న సృష్టి గోస్వామి, 2018లో ఉత్తరాఖండ్ బాల విధానసభకు ముఖ్యమంత్రిగా కూడా పని చేసింది. అలానే 2019లో గర్స్ ఇంటర్నేషనల్ లీడర్షిప్ కోసం సృష్టి థాయిలాండ్ వెళ్లినట్టు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ వేసవి రాజధాని గైర్సైన్ నుంచి ఒక్కరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతల నిర్వహించనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ ఆయుష్మాన్, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, హోంస్టే పథకాలు, అభివృద్ధి పనులపై సమీక్ష కూడా సృష్టి జరపనుంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version