నవీన్ కేసులో హరిహర కృష్ణ ప్రియురాలికి 14 రోజుల రిమాండ్‌

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవీన్ ప్రేమించిన అమ్మాయిని, ప్రేమించిన హరిహర కృష్ణ అమ్మాయి కోసం నవీన్ ను అత్యంత పాశవీకంగా నవీన్ తల, మొండెం వేరుచేసి, వేళ్ళు కత్తిరించి, గుండె బయటకు తీసి, మరణ హోమానికి పాల్పడ్డాడని తెలిసిందే..

 

అయితే, ఈ కేసులో ఓ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నవీన్ కేసులో హరిహర కృష్ణ ప్రియురాలికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. నవీన్ హత్య కేసులో హరిహర కృష్ణ స్నేహితుడు హాసన్, ప్రియురాలు నిహారిక రెడ్డిని నిన్న న్యాయమూర్తి నివాసం లో హాజరు పరిచారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. హాసన్ ను చర్లపల్లి జైలు , నీహారిక ను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించనున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version