సీఎం కేసీఆర్ కారణ జన్ముడని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ లో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నీ విజేతలకు హరీశ్ రావు ట్రోఫిలను అందజేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా క్రికెట్ టోర్నీని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. దేశానికే ఆంధ్రప్రదేశ్ అన్నం పెడుతుందని హరీశ్ రావు తాను తినిపిస్తేనే తెలంగాణ వాళ్లు అన్నం తిన్నారని చంద్రబాబు అంటుండు… ఇంకా నయం చార్మినార్ కూడా తానే కట్టానని అంటాడేమోనని హరీశ్ ఎద్దేవా చేశారు. ఏపీలో వరి సాగు 16 లక్షల ఎకరాలు, తెలంగాణ లో 54 లక్షల ఎకరాల వరి నాట్లు వేశారని చెప్పారు. తెలంగాణ పథకాల గురించి పోక్సన్ కంపెనీ ప్రతినిధి ఆశ్యర్యపోయాడని హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ ను తైవాన్ దేశానికి రావాల్సిందిగా కోరారని చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న ఉద్యోగార్థులు బాగా కష్టపడి చదివి సిద్దిపేట జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన మెటిరీయల్‌ను సిద్దిపేట సీపీ శ్వేతతో కలిసి మంత్రి హరీశ్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్లలో ఇస్తున్న మెటిరీయల్‌నే సిద్దిపేటలోనూ అందిస్తున్నామని తెలిపారు. ఉద్యోగార్థులుగా మీ ఆత్మ విశ్వాసాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. మీరంతా ఎంతో కష్టపడి ప్రిలిమ్స్, ఫిజికల్ ఈవెంట్స్ క్లియర్ చేసుకుని మెయిన్స్ సిద్ధపడుతున్నందుకు అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.