నిరుద్యోగులకు శుభవార్త. మలంజ్కంద్ లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(HCL) సంస్థ పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఇందులో మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ఎలక్ట్రీషియన్ గ్రేడ్, ఎలక్ట్రీషియన్ కం లైన్ మెన్ గ్రేడ్ తదితర పోస్టులు వున్నాయి. ఐటీఐ(ఎలక్ట్రిషియన్), ఎన్సీవీటీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. అదే విధంగా అభ్యర్థులకు కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలని తెలిపారు. 35 ఏళ్లు ధాటిని వాళ్ళు అప్లై చెయ్యడానికి అనర్హులు.
ఇది ఇలా ఉంటే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకు రూ.18,180 నుంచి రూ. 37,310 వరకు వేతనం చెల్లించనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 15లోగా తమ దరఖాస్తులను కింద వున్న ఎడ్రస్ కి పంపాలి.
పూర్తి వివరాలని అఫీషియల్ నోటిఫికేషన్ లో చూడచ్చు. అప్లికేషన్ ఫామ్ ను అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Hindustan Copper Limited, Tamra Bhawan, 1, Ashutosh Chowdhary Avenue, Kolkata – 700019 చిరునామాకు పంపాలి.