బ్యాంకులు మాములుగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి వివిధ స్కీమ్స్, పాలిసిస్ లను అందుబాటులోకి తీసుకువస్తూ ఉంటారు. కానీ ఏ స్కీం లేదా పాలసీ అయినా ప్రజల్లోకి విరివిగా వెళ్లాలంటే అందుకు తగిన ప్రమోషన్స్ చేయవలసిందే. అందులో భాగంగానే బ్యాంక్స్ కొన్ని యాడ్స్ ను చేసి వాటి ద్వారా స్కీం ల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెబుతుంటారు. తాజాగా ప్రముఖ కార్పొరేట్ బ్యాంకు అయిన HDFC చేసిన ఒక యాడ్ ఇప్పుడు కొత్త చిక్కులను తీసుకువచ్చింది. ఈ యాడ్ లో ఒక మహిళా నుదుటున బొట్టుకూ బదులుగా, ఒక స్టాప్ అనే సింబల్ ను పెట్టడం ఇప్పుడు వివాదంగా మారుతోంది. ఈ యాడ్ ను చూసిన హిందూ మహిళలు పవిత్రంగా భావించే బొట్టు స్థానంలో స్టాఫ్ సింబల్ ను ఏ విధంగా పెడతారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం దసరా నవరాత్రి సమయం కూడా కావడం వలన ఇది పెద్ద స్థాయిలో దుమారాన్ని రేపే అవకాశం ఉంది. దీనిపై HDFC బ్యాంకు స్పందించకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.