ప్రపంచకప్ కి హార్దిక్ పాండ్య స్థానంలో అతన్ని సెలెక్ట్ చేయాలి : తివారీ

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అంతగా రాణించలేకపోతున్న హార్దిక్ పాండ్యాపై మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ బౌలింగ్ పేలవంగా ఉందని విమర్శించారు. ప్రస్తుత ఫామ్తో టీ20 వరల్డ్ కప్కు పాండ్యా ఎంపిక కావడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు.అతనికి ప్రత్యామ్నాయంగా ఆల్రౌండర్ కోటాలో శివమ్ దూబేను ఎంపిక చేయాలని సూచించారు. అయితే బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ రాణిస్తేనే దూబే వరల్డ్ కప్కి ఎంపిక కాగలరని వ్యాఖ్యానించారు.

కాగా ,ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుండి హార్థిక్ పాండ్యని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే కెప్టెన్సీ లోను హర్డిక్ పాండ్య విఫలం చెందుతున్నాడు. ఇక ఇటు బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా కూడా దారుణంగా నిరాశ పరుస్తున్నాడు.ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 48 బంతులు వేసి 89 పరుగులిచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version