బెదిరించడానికి ఏకంగా గన్ మెన్ లను వాడేసాడు, గన్ మెన్ ల ఉద్యోగాలు హుష్…?

-

హైదరబాద్ లో ప్రొద్దుటూరు టిడిపి మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కొడుకు కొండా రెడ్డిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పదిహేను మంది అనుచరులతో డ్రిస్టిబ్యూటర్ శివగణేష్ ను బెదిరించాడు కొండారెడ్డి. బెదిరింపుల్లో పాల్గొన్న కొండారెడ్డి గన్ మెన్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ గన్ మెన్లను ప్రైవేట్ సెటిల్మెంట్ కు కొండారెడ్డి వాడటం గమనార్హం. గన్మెన్లు ఇద్దరిని కడప లో అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు.

ఇద్దరు గన్ మెన్లను బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. గత నెల 26 న శివగణేష్ ను బెదిరించిన సమయంలోనూ స్పాట్ లో ఉన్నారు ఇద్దరు గన్ మెన్లు. కొండా రెడ్డి గన్ మెన్ల పై ఏపీ పోలీస్ శాఖ సీరియస్ అయింది. వారి ఇద్దరినీ సర్వీస్ నుంచి తప్పించే అవకాశం ఉందని తెలుస్తుంది. కొండా రెడ్డి అండ్ గ్యాంగ్ కోసం బంజరాహిల్స్ పోలీసుల గాలింపు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version