కొత్త వైరస్ టెన్షన్ : తెలంగాణా వైద్యారోగ్య శాఖ అలెర్ట్

-

బ్రిటన్ లో కరోనా వైరస్ కొత్త రూపు మొదలయింది. వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో లండన్ తో పాటు ఆగ్నేయ ఇంగ్లండ్ మొదలగు ప్రాంతాల్లోలాక్డౌన్ విధించారు. క్రిస్ మస్ దగ్గర పడుతున్న క్రమంలో కరోనా కొత్త రూపం మరింత విజృంభిస్తుందన్న ఆలోచనతో అక్కడ ముందే లాక్ డౌన్ ప్రకటించారు. ఈ నేపథ్యం లో బ్రిటన్ నుండి వచ్చే విమానాలు అలానే బ్రిటన్ కి వెళ్ళే విమానాలను కూడా ప్రస్తుతానికి నిషేధించారు. ఇప్పటికే భారత్ సహా పన్నెండు దేశాలు విమానాలని నిలిపివేసాయి.

 

బ్రిటన్ ఒక్కటే కాదు యూరోపియన్ దేశాల్లో కరోనా కొత్తరూపం భయంకరంగా విజృంభించేలా ఉందని అంటున్నారు. ఈ కారణంగా కరోనాని కట్టడి చేయడానికి భారత్ కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంతోంది. రేపటి నుండి అక్కడి నుండి వచ్చే విమానాలని నిలిపివేశారు.  ఈ కరోనా కొత్త రకం వైరస్ నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తం అయింది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను వైద్య శాఖ ట్రాక్ చేస్తోంది. ఎయిర్ పోర్ట్ లోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన వాళ్ళను ఆస్పత్రులకు నెగిటివ్ వచ్చినా వారం రోజులు క్వారంటైన్ కి పంపేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు చేబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version