ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుల బెయిల్ పిటిషన్ల పై రౌస్ ఏవిన్యూ స్పెషల్ కోర్టులో విచారణ కొనసాగుతుంది. శరత్ చంద్రారెడ్డి తో పాటూ విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్ పల్లి బెయిల్ పిటిషన్లపై విచారిస్తుంది సీబీఐ స్పెషల్ కోర్ట్. విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్ పల్లి లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు పరిచారు ఈడి అధికారులు.
కోర్టులో శరత్ చంద్రారెడ్డిని హాజరు పరిచారు. శరత్ చంద్రారెడ్డి తరపున స్పెషల్ కోర్టులో వాదనలు వినిపించారు కపిల్ సిబల్. ఇక ఈడి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సౌత్ గ్రూప్ పైనే ప్రధాన ఆరోపణలు ఉన్నాయని, విజయ్ నాయర్ ద్వారా 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ చేరవేసిందన్నారు.
సౌత్ గ్రూప్ లో శరత్ చంద్రారెడ్డి , మాగుంట శ్రీనివాసులు, అభిషేక్ బోయిన్ పల్లి, కవిత లతో కలిసి కిక్ బ్యాక్ చేశారని పేర్కొన్నారు. ఈడి 100 కోట్ల కు సంబంధించిన ఆధారాలను సేకరించిందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో శరత్ చంద్రారెడ్డి కీలక భూమిక పోషించారని.. శరత్ చంద్రారెడ్డి కంపెనీలను ఈ స్కాం లో భాగస్వామ్యం చేశారని న్యాయస్థానానికి వివరించారు.