నైరుతి రుతుపవనాల ఆగమనం.. రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు..

-

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైనప్పటికీ.. వర్షాలు దంచికొడుతున్నాయి. రుతుపవనాల రాకతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత రాత్రి భారీ వర్షాలు కురిశాయి. బుధవారం రాత్రి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురవగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ, జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి కొన్ని గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి వరద ఉధృతికి రహదారులు కొట్టుకుపోయాయి. తెల్లవారుజాము నుంచి పలు గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. బుధవారం రాష్ట్రంలోనే అత్యధికంగా కేశంపేట మండలం సంగంలో 15.93 సెం.మీ, కందుకూరులో 13.13, ఆమన్‌గల్‌లో 12.68, మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌, వనపర్తిలలో 12 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

అలాగే, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో 11.06, కొత్తూరులో 7, యాచారంలో 6.7, కడ్తాల్‌లో 6.5, చేవెళ్లలో 6.33, ఇబ్రహీంపట్నంలో 6.33, తలకొండపల్లిలో 5.43 సెం.మీ వర్షం పడింది. ఆమన్‌గల్‌ మండలంలో మేడిగడ్డ-శంకర్‌కొండ మధ్య కత్వ వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇబ్రహీంపట్నం, దండుమైలారం, కేశంపేట మండలంలోని సంగెం, పాపిరెడ్డిగూడ, ఇప్పలపల్లి, ఎక్లా్‌సఖాన్‌పేట, అల్వాల, కొత్తపేట, కొనాయపల్లి, సంతాపూర్‌ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఫరూఖ్‌నగర్‌ మండలం మధురాపురంలో చెరువులు, కుంటలు పొంగి ఉధృతంగా ప్రవహించాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర, కాప్రాలో జోరు వాన పడింది.

భారీ వర్షాలకు నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు మండలంలో దుందుభి నది పరవళ్లు తొక్కింది. అనేక చోట్ల చెట్ల కొమ్మలు తెగిపడి విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కల్వకుర్తిలో 8.8, కొల్లాపూర్‌లో 8 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీనితో పాటు హైదరాబాద్‌లోని పలు చోట్ల కూడా బుధవారం రాత్రి వర్షం కురిసింది. దీంతో కొన్ని చోట్ల విద్యుత్‌కు అంతురాయం కలిగింది. కొన్ని చోట్ల రోడ్లపైకి నీరువచ్చ చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version