ముంబై విమానాశ్రయంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత

-

పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా అక్రమ బంగారం తరలింపునకు అడ్డుకట్ట పడడం లేదు. అనుమానితులను అదుపులోకి తీసుకొని బంగారం సీజ్ చేస్తున్నా యదేచ్చగా అక్రమ బంగారాన్ని తరలించడానికి మరో కొత్త ప్లాన్ వేస్తున్నారు. తాజాగా ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా విదేశీ బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు.

7.87 కోట్ల విలువ చేసే 15 కేజీల బంగారం సీజ్ చేశారు. దుబాయ్ నుండి వేరు వేరు‌ విమానాల్లో ముంబాయి వచ్చిన 4 గురయ సుడాన్ జాతీయుల వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టు గా మార్చి ఛాతీ, భుజం భాగాలలో దాచి తరలించే యత్నం చేశారు కేటుగాళ్లు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్కానింగ్ లో అక్రమ‌ బంగారం గుట్టు బయటపడింది. సుడాన్ జాతీయుల తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version