వాయిదా ప‌డిన యంగ్ హీరో నితిన్ పెళ్లి.. రీజ‌న్ ఏంటంటే..?

-

మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో యంగ్ హీరో నితిన్ ఒకడు. నూనూగు మీసాల వయసులోనే నితిన్ జయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల‌తో హిట్ కొట్టి టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ గుర్తుంపు తెచ్చుకున్నాడు. ఇదే జోరును కొన్నేళ్ల పాటు చూపించిన నితిన్.. మధ్యలో వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతడి కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఇష్క్’ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం నితిన్ చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. ఇక ఈయ‌న త్వ‌ర‌లోనే హీరో నితిన్‌ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

 

షాలిని అనే అమ్మాయిని నితిన్‌ గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని నితిన్‌ ఇంట్లో చెప్పేయడంతో వారూ ఒప్పుకున్నారు. ఇక నితిన్‌ పెళ్లి ఈ ఏడాది ఏప్రిల్‌ 15న జరుగుతుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య దుబాయ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోబోతున్నారనే పుకార్లు టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే పెళ్లి వాయిదా పడిందని తాజా సమాచారం. పెళ్లి ఏప్రిల్‌లో కాకుండా మేలో పెట్టుకుందామని నితిన్ ఇంట్లో వారితో చెప్పినట్లు తెలుస్తోంది. వరుస సినిమాల వల్ల నితిన్‌ ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోలేకపోతున్నారని తెలిసింది. కాగా, ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్‌ దే సినిమాలో నటిస్తున్నాడు‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version