డబ్బు పిచ్చితో నయనతార కెరీర్ డేంజర్ లో పడిందా…?

-

కోలీవుడ్ లో నయనతారకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోయిన్లకు కూడా షాక్ ఇస్తుంది. వరుసగా హిట్ లు కొట్టకపోయినా కోలీవుడ్ లో మాత్రం దర్శక నిర్మాతలు చాలా మంది ఆమెతో సినిమా చేయడానికి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అనేది వాస్తవం. ఒక్క అవకాశం ఆమె ఇస్తే హిట్ కొడతాం అనుకునే కుర్ర దర్శకులు ఎందరో తమిళనాట ఉన్నారు.

అయితే నిర్మాతలకు మాత్రం ఆమె చుక్కలు చూపిస్తుంది. ఈ సీనియర్ భామ సినిమా సినిమాకు ఏడు కోట్ల వరకు వసూలు చేస్తుంది. దానికి తోడు పాప షూటింగ్ లో పాల్గొంటే రోజుకి 60 నుంచి లక్ష వరకు నిర్మాత జేబు నుంచే పెట్టాల్సి ఉంటుంది. అదే విధంగా ఆమె బాయ్ ఫ్రెండ్ వచ్చినా ఆయనకు కూడా సౌకర్యాలు నిర్మాతే పెట్టాలి. దీనితో నయనతార తో సినిమా అంటే మాసం ఖర్చు కంటే మసాలా ఖర్చు ఎక్కువని భావిస్తున్నారు.

దీనితో నిర్మాతల మండలలిలో ఆమె ఖర్చుపై పెద్ద చర్చలే జరుగుతున్నాయి. హీరోలే తక్కువకి వస్తుంటే హీరోయిన్ కి అంత పారితోషకం ఎందుకు అని భావిస్తున్నారు. ఇంతకుముందు నిర్మాత రాజన్ కూడా నయనతార పారితోషకం విషయంలో ఆందోళన వ్యక్తం చేసారు. ఇలా అయితే కష్టమని నిర్మాతలు కూడా అంటున్నారు. ఇక నుంచి నిర్మాతలు అందరూ కూడా ఆమె ఖర్చు విషయంలో ఒకటి ఫాలో అవ్వాలని భావిస్తున్నారు. ఆమెకు పెట్టే రోజు వారీ ఖర్చులను పారితోషకం నుంచే ఖర్చు పెట్టి, మొత్తం ఇచ్చేటప్పుడు వాటిని తీసేసి ఇవ్వాలని భావిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version