ఏపీ మంత్రి కాకాని కి హైకోర్టు నోటీసులు

-

ఏపీ మంత్రి కాకాని కి హైకోర్టు మంగళవారం నోటీసులు అందజేసింది.నెల్లూరు కోర్టులో చోరి అంశంపై సుమోటోగా తీసుకొని, ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ ప్రారంభించింది.కేసు దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదన్న నెల్లూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని హైకోర్టు నేరుగా విచారణ చేపట్టింది.ఈ కేసును సీబీఐకి అప్పగించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి తెలిపారు.దీంతో ఈ అంశంపై ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, సిబిఐ డైరెక్టర్, ఏపీ డీజీపీ కి నోటీసులు అందజేసింది.అనంతరం ఈ కేసులో విచారణను హైకోర్టు మే 9 వ తేదీకి వాయిదా వేసింది.

నెల్లూరు జిల్లా కోర్టులో 2 వారాల క్రితం చోరీ జరిగింది. చోరీ కుగురైన ఫైళ్లలో ప్రస్తుతం ఏపీ మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి.దీని వెనుక మంత్రి ప్రమేయం ఉందని టిడిపి ఆరోపించింది.గతంలో టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని కాకాని ఆరోపించారు.అందుకు సంబంధించిన కొన్ని పత్రాలను సమర్పించారు.అయితే అవన్నీ తప్పుడువని సోమిరెడ్డి ఆరోపిస్తూ, కేసు పెట్టారు.దీంతో ఆధారాలను ధ్వంసం చేసేందుకే చోరీ జరిగిందని టిడిపి ఆరోపించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version