పుదుచ్చేరి పాలిటిక్స్ హీటెక్కాయి. ఈరోజు అదనపు గవర్నర్ గా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ వెంటనే ఆమెను విపక్ష ఎమ్మెల్యేలు కలిసే అవకాశం ఉందని అంటున్నారు. అలానే ఆ వెంటనే బలపరీక్షకి ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరనున్నట్టు తెలుస్తోంది. అయితే త్వరలో ఎన్నికలు జరగబోయే పుదుచ్చేరికి కిరణ్ బేడీ ప్లేస్ లో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తమిళిసై అయితేనే కరెక్ట్ అనే ఆలోచనలో బీజేపీ పెద్దలు భావించి ఆమెను అక్కడికి పంపారని అంటున్నారు.
అసలు మామూలుగా గవర్నర్ పోస్ట్ ఖాళీ అయితే ఆ పక్కన ఉన్న రాష్ట్ర గవర్నర్ కు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం ఇప్పటి దాకా ఆనవాయితీగా వస్తోంది. కానీ పుదుచ్చేరి విషయంలో మాత్రం పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్, తమిళ నాడు గవర్నర్ లను కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు. తమిళిసైని పుదుచ్చేరికి పూర్తి స్థాయి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా చేసి.. తెలంగాణకు కిరణ్ బేడీని గవర్నర్ గా పంపే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్న్నారు.