గుంటూరులోని పీవీకే కూరగాయల మార్కెట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిల్డ్ ఏపీ పధకం నుండి మార్కెట్ స్థలాన్ని మినహాయించినా వ్యాపారాలకు ఇంకా మునిసిపల్ అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో విసిగి వేసారి పోయిన ఆ వ్యాపారులు ఈరోజు స్వయంగా షాపులు తెరిచి కూరగాయలు అమ్మడం మొదలు పెట్టారు.
వ్యాపారం చేసేందుకు అనుమతి లేదని మునిసిపల్ అధికారులు అడ్డుకున్నారు. పోలీసులతో బలవంతంగా షాపులు మూయించారు అధికారులు. దీంతో మునిసిపల్ అధికారుల తీరుతో ఒంటిపై పెట్రోల్ పోయానుకొని ఒక వ్యాపారి ఆత్మహత్య యత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న తోటి వ్యాపారులు అడ్డుకున్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తారు.