‘హిజాబ్’ వివాదంపై సుప్రీం కోర్ట్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. హిజాబ్ అత్యవసర విచారణకు నిరాకరించింది. హిాజాబ్ వివాదంపై ఇటీవల కర్ణాటక హైకోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. ఇస్లాం మతంలో హిజాబ్ అనేది తప్పనిసరి ఆచారం కాదని.. విద్యాసంస్థల్లో హిజాబ్ బ్యాన్ ను సమర్థించింది. విద్యాలయాలకు విద్యార్థుల యూనిఫాం తోనే రావాలంటూ సంచలన తీర్పును వెల్లడించింది. జస్టిస్ అవస్థితో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. అయితే ఈ తీర్పును వ్యతిరేఖిస్తూ… అత్యవసర విచారణ జరపాలంటూ విద్యార్థినిలు సుప్రీం గడప తొక్కారు. అయితే హోళీ తరువాత విచారిస్తామని గత వారం సుప్రీం కోర్ట్ చెప్పింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈరోజు కూడా సుప్రీం అత్యవసర విచారణకు నో చెప్పింది. విద్యార్థుల పరీక్షల సమయంలో హిజాబ్ వివాదాన్ని సంచలనం చేయవద్దని సుప్రీం కోర్ట్ వెల్లడించింది. పరీక్షలకు హిజాబ్ కు సంబంధం లేదిన సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించింది.
గత జనవరి నుంచి కర్ణాటకలోని పలు జిల్లాలో హిజాబ్ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ముస్లిం అమ్మాయి హిాజాబ్ ధరించడాన్ని హిందు విద్యార్థులు అభ్యంతరం తెలుపుతూ… కాషాయ కండువాతో తరగతులకు హాజరుకావడంతో ఇరు వర్గాల మధ్య కాస్త ఘర్షణ వాతావరణం నెలకొంది. కర్ణాటకలోని శివమొగ, చిక్ మంగళూర్, కొప్పెల, బెలగావి మొదలైన జిల్లాల్లో హిజాబ్ వివాదం నెలకొంది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం పరిధిలో ఉంది.