ఓటీటీలోకి హిందీ ఛత్రపతి.. ఎప్పుడంటే..?

-

ఛ‌త్ర‌ప‌తి రీమేక్‌తో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ రీమేక్ నార్త్ ఆడియెన్స్‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఒరిజిన‌ల్‌లోని మ్యాజిక్‌ను రీ క్రియేట్ చేయ‌డంలో విఫ‌ల‌మైంది. థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్ టాక్‌ను తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది.ఆగ‌స్ట్ 18 నుంచి జీ5 ఓటీటీలో ఛ‌త్ర‌ప‌తి మూవీ స్ట్రీమింగ్ కానుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ కి ‘రాక్షసుడు’ తరువాత హిట్ పడలేదు. ఒక వైపున తెలుగులో ఫ్లాపులు ఎదుర్కుంటూ వచ్చిన ఆయన, ఆ సమయంలోనే హిందీ ‘ఛత్రపతి’లో చేశాడు. తెలుగులో రాజమౌళి – కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా, అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అలాంటి ఒక కంటెంట్ తోనే మే 12వ తేదీన బాలీవుడ్ కి బెల్లంకొండ పరిచయమయ్యాడు. వినాయక్ కి మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గా మంచి పేరు ఉంది. అయితే, ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version