మీ ఎస్‌బీఐ డెబిట్ కార్డును ఇలా బ్లాక్ చేయండి.. స్టెప్ బై స్టెప్‌..!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు దేశ‌వ్యాప్తంగా 50వేల‌కు పైగా ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. అయితే డెబిట్ కార్డు పోయినా లేదా ఫ్రాడ్ జ‌రిగినా దాన్ని వెంట‌నే బ్లాక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే భారీగా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది. ఎస్‌బీఐ డెబిట్ కార్డును బ్లాక్ చేసేందుకు ప‌లు స్టెప్స్ ఉన్నాయి. అవేమిటంటే…

స్టెప్ 1: www.onlinesbi.com అనే సైట్ ఓపెన్ చేయాలి.

స్టెప్ 2: అక్క‌డ వ‌చ్చే విండోలో యూజ‌ర్‌నేమ్‌, పాస్‌వ‌ర్డ్‌ను ఎంట‌ర్ చేసి లాగిన్ అవ్వాలి.

స్టెప్ 3: ఏటీఎం కార్డ్ స‌ర్వీసెస్ ఆప్ష‌న్‌లోని ఇ-స‌ర్వీసెస్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.

స్టెప్ 4: త‌రువాత కొత్త వెబ్‌పేజీ క‌నిపిస్తుంది. అందులో బ్లాక్ ఏటీఎం కార్డు అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి.

స్టెప్ 5: మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు అనుసంధాన‌మై ఉండే యాక్టివ్‌, బ్లాక్ అయిన కార్డుల వివ‌రాలు క‌నిపిస్తాయి. కార్డుల‌కు చెందిన మొద‌టి, చివ‌రి 4 అంకెల‌ను మాత్ర‌మే అక్క‌డ చూడ‌వ‌చ్చు.

స్టెప్ 6: అక్క‌డ ఇచ్చిన ఆప్ష‌న్లలో మీరు బ్లాక్ చేయ‌ద‌లుచుకున్న కార్డును ఎంచుకోవాలి. అనంత‌రం స‌బ్‌మిట్ బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి. త‌రువాత వివ‌రాల‌ను ఒక సారి స‌రిచూసుకుని క‌న్‌ఫాం చేయాలి.

స్టెప్ 7: అనంత‌రం మొబైల్‌కు ఓటీపీ వ‌స్తుంది. లేదా ప్రొఫైల్ పాస్‌వ‌ర్డ్ ద్వారా కూడా ఆ లావాదేవీని ధ్రువీక‌రించాలి.

స్టెప్ 8: త‌రువాతి పేజీలో ఓటీపీ లేదా ప్రొఫైల్ పాస్‌వ‌ర్డ్‌ను ఎంట‌ర్ చేయాలి.

స్టెప్ 9: అనంత‌రం క‌న్‌ఫాం చేయాలి.

దీంతో మీ ఎస్‌బీఐ డెబిట్ కార్డు బ్లాక్ అవుతుంది. దానికి సంబంధించిన ఓ మెసేజ్ వ‌స్తుంది. ఈ విధంగా ఎస్‌బీఐ డెబిట్‌ కార్డును సుల‌భంగా బ్లాక్ చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version