ఈ అలవాట్లు ఉంటే.. ఈజీగా స్టడీ స్కిల్స్ ని పెంచుకోవచ్చు..!

-

ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని అనుకుంటుంటారు. లైఫ్ మొత్తం మనం ఏదో ఒకటి చదువుతూ ఉండాలి. అప్పుడే మన ఎదుగుదల బాగుంటుంది. అయితే స్టడీ స్కిల్స్ ని ఎలా పెంచుకోవచ్చు..? స్టడీ స్కిల్స్ ని పెంచుకోవడానికి మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని ఫాలో అయితే ఎప్పుడూ కూడా బాగా స్కోర్ చేయొచ్చు. అలాగే స్టడీ స్కిల్స్ ని పెంపొందించుకోవచ్చు. స్టడీ స్కిల్స్ ని పెంచుకోవడానికి మైండ్ మ్యాపింగ్ మంచిది. పుస్తకంలో కాన్సెప్ట్స్ ని ఆలోచనలను లింక్ చేసే ఈ మైండ్ మ్యాపింగ్ పద్ధతి చాలా బాగుంటుంది.

దీన్ని అలవాటు చేసుకుంటే ఈజీగా అర్థం చేసుకుని చదువుకోవచ్చు. నోట్స్ రాసుకునేటప్పుడు రకరకాల రంగుల్ని ఉపయోగించి రాసుకోండి. ఇది బాగా గుర్తు పెట్టుకోడానికి సహాయపడుతుంది. టాపిక్ ని కలర్ కోడింగ్ చేయడం వలన ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటుంది. ఒంటరిగా కాకుండా తోటి విద్యార్థులతో చదువుకోండి. అర్థం కాని టాపిక్లని షేర్ చేసుకోవచ్చు. తెలియనివి తెలుసుకోవచ్చు.
మంచిగా గుర్తుంటాయి కూడా.

అలాగే బాగా చదివింది గుర్తుండడానికి ఎడ్యుకేషనల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. మీ చదువుకు సంబంధించిన వీడియోస్ ని చూసి కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకోండి. ఎడ్యుకేషనల్ బోర్డ్ గేమ్స్ వంటివి అలవాటు చేసుకుంటే బాగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమైన సమాచారాన్ని బాగా గ్రహించి అవసరానికి తగ్గట్టుగా ఆర్గనైజ్ చేసుకోవడానికి నోట్ టేకింగ్ హెల్ప్ చేస్తుంది. ఇలా నోట్స్ రాసుకోవడం వలన ముఖ్యమైన పాయింట్స్ గుర్తుంటాయి. ఈజీగా చదువుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news