ఆన్‌లైన్‌లోనే SBI బ్యాంక్ అకౌంట్‌ను మీకు కావాల్సిన బ్రాంచ్‌కు ఇలా మార్చచ్చు..!

-

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా? మీరు మీ బ్యాంక్ అకౌంట్‌ను వేరే బ్రాంచ్‌కు  మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసం. దీని కోసం మీరు బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ఇంట్లో నుండే సులువుగా మార్చుకోవచ్చు. ఇంట్లో వుంది ఎస్‌బీఐ కస్టమర్లు తమ బ్యాంక్ అకౌంట్‌ను వేరే బ్రాంచ్‌కు ఆన్‌లైన్‌ లోనే మార్చుకోవచ్చు. దీని వల్ల కస్టమర్లకు చాలా వరకు సమయం ఆదా అవుతుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే…

 

sbi | ఎస్‌బీఐ

SBI బ్యాంక్ అకౌంట్‌ మార్చే ప్రక్రియలో మీ అకౌంట్ నెంబర్, బ్రాంచ్ కోడ్ లాంటి వివరాలు సరిగ్గా ఎంటర్ చేయాలి. కనుక ముందే క్లియర్ గా అన్ని తెలుసుకోండి. అలానే ఎస్‌బీఐలో మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉండాలి గమనించండి.

ముందుగా https://www.onlinesbi.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. Personal Banking ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు ముందుగా యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత e-service ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీరు ‘Transfer Savings Account ‘ పైన క్లిక్ చేయాలి. ఏ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ ని మీరు సెలెక్ట్ చేయాలి.

నెక్స్ట్ మీరు ఏ బ్యాంకు బ్రాంచ్‌కు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత Confirm బటన్ పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి Confirm బటన్ పైన క్లిక్ చేయాలి. దీనితో కొన్ని రోజుల్లోనే మీ అకౌంట్ మీకు కావాల్సిన బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మీకు దీని గురించి సమాచారం ఈమెయిల్ లేదా మెసేజ్ ద్వారా అందుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version