వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. వాతావరణ శాఖ హెచ్చరిక

-

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ విభాగం తెలిపింది. ఇది మరింత తీవ్రమై.. వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. దాని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు ( జులై 25 నుంచి) ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు..విశాఖ నగరంలో, గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఇవాళ్టి నుంచి 27వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో నేటి నుంచి 28వ తేదీ వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది. ఇవాళ రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. కాగా, గడచిన కొన్ని గంటల్లో ఏపీలో గురుగుబిల్లి (మన్యం జిల్లా)లో 10 సెంమీ, రణస్థలం (శ్రీకాకుళం)లో 7 సెంమీ, తిరువూరు (ఎన్టీఆర్ జిల్లా)లో 7 సెంమీ వర్షపాతం నమోదైంది. తెలంగాణలో గరిష్ఠంగా నిజామాబాద్ జిల్లా వేల్పూరులో 40 సెంమీ వర్షపాతం నమోదైంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version