వారానికి రూ.200 కిస్తీలు కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య

-

వారానికి రూ.200 ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఇద్దరు పిల్లలను అనాధలు చేసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్ (37), చందన (32) దంపతులు.. వీరు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు రిషి (14), జశ్వంత్ (12). వారు ఉండే గ్రామాల్లో కొందరు మహిళలను గ్రూపుగా ఏర్పరిచి ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారులు రుణాలిస్తుంటారు. కొద్ది నెలల కిందట చందన సభ్యురాలిగా ఉన్న సంఘం సభ్యులంతా కలిసి రూ.2.50 లక్షల వరకు అప్పు తీసుకున్నారు.

దీనికి ప్రతి వారం రూ.200 కిస్తీ కట్టాల్సి ఉంది.కొన్నాళ్లు సక్రమంగానే చెల్లించినా.. భర్త, పిల్లలు అనారోగ్యాల బారిన పడడంతో కొన్నాళ్లుగా చందన కిస్తీలు కట్టలేకపోయింది. ఫైనాన్స్ యజమాని ఒత్తిడి చేయడంతో భార్యాభర్తలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో చందన డిసెంబరు 6న గడ్డి మందు తాగగా.. ఇరుగుపొరుగు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.ఆమె పరిస్థితిపై ఆందోళనతో దేవేందర్ అదే నెల 20న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.భర్త మరణాంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చందన సైతం మంగళవారం మృతి చెందడటంతో పిల్లలిద్దరూ అనాధలుగా మిగిలారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version