ఈటల రాజేందర్ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఆయన వరుసగా ప్రతిపక్ష పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు. వారి మద్దతు కూడగడుతున్నారు. ఇదంతా గమనిస్తున్న టీఆర్ ఎస్ పార్టీ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ ఆయనపై మాట్లాడటం లేదు.
కానీ ఈటలను హుజూరాబాద్ లో ఒంటరి చేసే ప్రయత్నాలను వేగవంగం చేసింది. ఇందులో భాగంగానే ఈటలకు నమ్మిన వ్యక్తులుగా పేరున్న పలువురితో ప్రెస్‌మీట్లు పెట్టించి మరీ విమర్శలు చేయిస్తోంది. ఇప్పుడు తాజాగా మరో ఎంపీపీ ఈటలకు ఎదురు తిరిగింది.
జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత శనివారం ప్రెస్‌మీట్ పెట్టి ఈటల రాజేందర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఈటల తనను ఇబ్బంది పెట్టారని, ఎంతోమంది నాయకులను వాడుకుని వదిలేశారని చెప్పింది. ఈటల సొంత పార్టీ పెట్టే ఉద్ధేశముంటే ఇతర నాయకులను ఎందుకు కలుస్తున్నారని విమర్శించింది. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని, పార్టీ లైన్ దాటబోమని స్పష్టం చేసింది. దీంతో హుజూరాబాద్‌లో కేడర్ రెండు వర్గాలుగా విడిపోతోందని అర్థమవుతోంది. మరి దీనిపై ఈటల ఎలా స్పందిస్తారో చూడాలి.