పంజాగుట్ట బాలిక మృతి కేసులో ట్విస్ట్…ప్రియుడితో కలిసి చంపిన కన్న తల్లి!

-

పంజాగుట్ట చిన్నారి హత్య కేసు ను ఛేదించిన పోలీసులు… కన్న తల్లి కూతురు హత్య చేసినట్లుగా తేల్చారు. ఇందులో భాగంగానే బాలిక మృతికి కారణమైన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్..కన్న తల్లి, తన ప్రియుడితో కలిసి పాపను హత్య చేసినట్టు గుర్తించామన్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ లో నిందితులైన తల్లి హీన బేగం, ప్రియుడు షేక్ మొహమ్మద్ ఖాదర్ ను అరెస్ట్ చేసినట్లు వివరించారు జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్.

ప్రియుడు ఖాదర్ ది డబీర్ పురా, పాపా తల్లిది మియపూర్ అని… టెడ్డి కాంపౌండ్ షైక్ పేట్ లో ఖాదర్ తో హీన భేగం కు పరిచయం ఏర్పడిందన్నారు జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్. ఖాదర్ తో తన సమస్యలు చెప్పుకున్న హీన భేగం.. అనంతరం ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది… ఆ సాన్నిహిత్యం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసిందని వివరించారు. పిల్లలను తీసుకుని ఇద్దరు ముంబై, ఢిల్లీ, జైపూర్ మనాలి వెళ్లారు.. అక్కడ పిల్లల చేత భిక్షాటన చేయించారని వెల్లడించారు.

చిన్నారి బేబీ మెహక్ బెగ్గింగ్ చెయ్యడం ఇష్టం లేక పోవడంతో ప్రతిఘటించిందని… నాన్న దగ్గరికి వెళ్తానని గొడవ చేయడంతో చిన్నారిని ఖాదర్,హీన బేగం దారుణంగా కొట్టి హత్య చేశారని స్పష్టం చేశారు. చిన్నారిని బెంగళూరు నుండి హైదరాబాద్ తీసుకు వచ్చి పంజాగుట్ట ద్వారాకపురి కాలనిలో ఓ షాపు వద్ద వదిలి వెళ్టారని.. ఘటన స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు ఛేదించడం కష్టం అయిందని ఆయన తెలిపారు. నిందితులు హైదరాబాద్ వస్తున్నారన్న సమాచారం మేరకు జూబ్లీ బస్టాప్ లో నిందితులను అరెస్ట్ చేసామని తెలిపారు. నిందితులు ఇద్దరిని రిమాండ్ కు పంపామని వెల్లడించారు జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version