మార్చి 31 తరువాత ఛలాన్లపై రాయితీ ఉండదు… ఆ తరువాత చర్యలే : ఏవీ రంగనాథ్, జాయింట్ సిపి, ట్రాఫిక్, హైదరాబాద్

-

ప్రజలపై ఆర్థికభారం తగ్గించడానికే ఛలానా డిస్కౌంట్లు ప్రకటించామని.. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సామాన్యులపై ఆర్థిక భారం పడుతున్న కారణంగా పెండింగ్ ఛలానా డిస్కౌంట్ ప్రకటించామని అన్నారు ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1750 కోట్ల ఛలానాలు పెండింగ్ లో ఉన్నాయని ఆయన అన్నరు. డిస్కౌంట్ ప్రకటించడం ద్వారా కేవలం రూ. 300 కోట్లు మాత్రమే ఆదాయం రానుందని అన్నారు. ట్రాఫిక్ ఛలాన్ల వల్ల ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుందనే అపోహ ఉండకూడదని అన్నారు. రెవెన్యూ నింపడానికి అయితే డిస్కౌంట్ ప్రకటించే వాళ్లం కాదని అన్నారు. ప్రజలకు ఆర్థిక భారం పడకూడదనే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఛలాన్లు వేయాల్సిన అవసరం ఉండని రంగనాథ్ అన్నారు. మార్చి31 తర్వాత ఛలానా డిస్కౌంట్ ఉండవని ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రస్తుతం రూ. 50 కోట్ల విలువైన ఛలాన్లు క్లియర్ అయ్యాయని.. తొలి మూడు రోజుల్లో రూ. 39 కోట్లు వసూలయ్యాయని అన్నారు. మార్చి 31 తర్వాత నుంచి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే చర్చలు ఉంటాయని అన్నారు. స్పీడ్ లిమిట్స్ పై కూడా ఒక నోటిఫికేషన్ తయారు చేస్తున్నామని..అధిక స్పీడ్ తో వెళ్లిన వారికి రూ.1000 ఫైన్ ఉండేదని.. వాహనాన్ని బట్టి స్పీడ్ ఛలాన్లు వేసేలా సర్క్యులర్ తయారు చేస్తన్నట్లు వెల్లడించారు. టూ వీలర్లకు రూ. 200 నుంచి రూ.300 ఫైన్ విధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version