మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది : రాజమౌళి

-

దర్శకధీరుడు ప్రస్తుతం జపాన్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్ లోను రిలీజ్ చేశారు. గతేడాది ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఈ చిత్రాన్ని జపాన్ లో 100 ఏళ్లనాటి పురాతన మ్యూజికల్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్ ద్వారా పంచుకున్నారు.

రాజమౌళి ట్విటర్లో రాస్తూ.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను 110 ఏళ్ల నాటి తకరాజుకా సంస్థ నిర్వహించే మ్యూజికల్ ఫ్యామిలీ  థియేటర్లో ప్రదర్శించడం విశేషం. ఆర్ఆర్ఆర్ చిత్రం లాగే ఈ మ్యూజికల్ షోపై కూడా ప్రేమ చూపిన జపనీస్ ఆడియన్స్ కి ధన్యవాదాలు. మీ రెస్పాన్స్ చూస్తే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ షోలో మీ శక్తి, ప్రతిభ నన్ను ఆశ్చర్యపరిచాయి. ఈ ఈవెంట్ లో భాగమైన అమ్మాయిలను అభినందించకుండా ఉండలేకపోతున్నా’ అని రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ దర్శకధీరుడిని అభినందిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కనుంది.

Read more RELATED
Recommended to you

Latest news