ఫ్లోరిడాను వణికించిన హరికేన్ అయాన్

-

అగ్రరాజ్యం అమెరికాను భారీ హరికేన్.. అయాన్ వణికిస్తోంది. పెద్ద ఎత్తున విరుచుకుపడ్డ హరికేన్ అయాన్ ప్రభావానికి ఫ్లోరిడా చిగురుటాకులా వణికిపోయింది. భారీ ఈదురుగాలులతో ఫ్లోరిడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ తుపాను ధాటికి క్యూబాలో ఇద్దరు మరణించారు.
అయాన్‌ హరికేను ధాటికి ఫ్లోరిడాలో 241 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అల్లకల్లోలం సృష్టించాయి. కుంభవృష్టులతో ఫ్లోరిడా వాసులు వణికిపోతున్నారు. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో 20లక్షల 50వేల మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
తుపాను నేపథ్యంలో ఫ్లోరిడాలో అంధకారం అలుముకుంది. పది లక్షల మంది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయాన్‌ తుపాను ధాటికి ఇప్పటికే క్యూబాలో ఇద్దరు మరణించినట్లు ఆ దేశం ప్రకటించింది. క్యూబాలోని విద్యుత్‌ వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.  ఈ భారీ హరికేన్‌ అమెరికాలోని ఫ్లోరిడాలో మరింత ఉత్పాతాన్ని సృష్టిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version