జామపండ్లని నైవేద్యంగా పెడితే.. ఏం ఆవుతుంది..?

-

జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. జామ పండ్ల లో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే జామ పండ్లు నైవేద్యంగా పెడితే చాలా మంచిదట. జామ పండ్లని నైవేద్యంగా పెడితే ఏమవుతుంది అనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నైవేద్యంగా మనం దేవుడికి వివిధ రకాల పండ్లను పెడుతూ ఉంటాము. ద్రాక్ష పండ్లు, జామ పండ్లు, అరటి పండ్లు ఇలా. పూజా కార్యక్రమంలో నైవిద్యం ఒక భాగం.

సరిగ్గా పూజ చేసి దేవుడికి నైవేద్యం పెడితే సిరిసంపదలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు. దేవుడికి నైవేద్యంగా ద్రాక్ష పండ్లను పెట్టి పేద వాళ్ళకి ఇస్తే పక్షవాత రోగాలు నయం అయిపోతాయి. ఇంట్లో వృద్ధులు వున్నా ఆ పండ్లను పెట్టొచ్చు చిన్న పిల్లలకి కూడా ఆ ఆ పండ్లు పెట్టొచ్చు. దేవుడికి నైవేద్యంగా పెట్టిన జామ పండ్లను కూడా మనం పిల్లలకి పెద్దలకి పెట్టొచ్చు. ఎవరైనా తినొచ్చు.

దేవుడికి జామ పండ్లను నైవేద్యం పెడితే సత్కారాలు పొందవచ్చట. వినాయకుడికి కనక జామ పండ్లను నైవేద్యంగా పెడితే అనారోగ్యానికి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి. జామ పండ్లను దేవుడికి నైవేద్యం పెడితే గ్యాస్టిక్ ఉదర సంబంధిత సమస్యలు దూరమైపోతాయని పండితులు అంటున్నారు.

జామ పండ్లను నైవేద్యం పెట్టి సుమంగళికి ఇస్తే షుగర్ వ్యాధి నుండి బయటకు వచ్చేయచ్చు ముత్తైదువులకి జామ పండ్లను తాంబూలం ఇస్తే మంచి వరుడు వస్తాడని కూడా అంటారు. వీటిని నైవేద్యం పెడితే మానసిక ఒత్తిడి కూడా దూరం అయిపోతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. సంతాన భాగ్యం కోసం జామ పండ్లను నైవేద్యం పెట్టినప్పుడు వాటిని నైవేద్యం పెట్టేసి పిల్లలు ఉన్న వాళ్లకి ఇస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version