గుండెలో రంధ్రం ఉంటే ఈ లక్షణాలు ఉంటాయట..!

-

ఈ రోజుల్లో గుండె ఆరోగ్యం ఏ వయసు వారికైనా ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్దుల వరకూ అందరికీ గుండె సమస్యలు ఉంటున్నాయి. జీవనశైలి అలా ఉంది మరీ..! గుండెకు ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఏం తప్పులు చేస్తే అసలు సమస్యలు వస్తాయి ఇలాంటి వాటిపై అందరికీ కనీస అవగాహన ఉండాలి. లక్షణాలు అనేవి భవిష్యత్తులో వచ్చే రోగాలకు సంకేతాలు. వాటిని గుర్తెరిగి ఉండాలి. గుండెలో రంధ్రం ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఈరోజు చూద్దాం..!

గుండెలో రంధ్రం ఉంటే కనిపించే లక్షణాలు..

గుండెలో రంధ్రం కారణంగా వేడి వాతావరణంలో కూడా చల్లబడటం లాంటి సంకేతాలు కనిపిస్తాయి. వేసవి కాలంలో చల్లగా ఉన్నా లేదా మీ శరీరం ఎల్లప్పుడూ చల్లగా ఉన్నా మీరు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే అలాంటి సమస్య ఉంటే గుండెకు రంధ్రం లేదా గుండె సంబంధిత వ్యాధి వచ్చే అవకాశ ఉందని సంకేతం.

అలసటగా అనిపించడం, ఎక్కువగా చెమటలు పట్టడం కూడా గుండెలో రంధ్రం ఉండే లక్షణాలే. మీకు అలసిపోయి ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటే.. దానిని విస్మరించకుండా వైద్యులను సంప్రదించండి. చెమటలు ఎక్కువగా పట్టడం అనేది అస్సలు మంచి విషయం కాదు.

శ్వాస తీసుకోవడంలో మళ్లీ మళ్లీ ఇబ్బంది ఉంటే న్యుమోనియా, గుండె జబ్బులు లేదా గుండెలో రంధ్రం వంటి సమస్యలను కూడా కలిగి ఉండవచ్చు. అలాంటప్పుడు వెంటనే వైద్యలను సంప్రదించాలి.

మీరు మాట్లాడేటప్పుడు లేదా నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం ప్రారంభిస్తే, గుండెలో రంధ్రం ఏర్పడే అవకాశం ఉందని గమనించుకోవాలి.. దీంతో చిన్న పిల్లలు కూడా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతూ కనిపిస్తారు. మాట్లాడేప్పుడు ఆయాసం ఎక్కువగా వస్తుంది.

గుండెలో రంధ్రం సమస్యతో ఉంటే.. పిల్లల శరీరం రంగు నీలం రంగులోకి మారుతుంది. పెదవులు, గోర్లు తీవ్రంగా ప్రభావితమవుతాయి. అటువంటి లక్షణాలు శరీరంలో కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

పై లక్షణాలు సాధారణం అయినవి ఏం కావు.. మీకు కానీ, మీకు తెలిసినవాళ్లలో కానీ ఈ లక్షణాలు ఉంటే.. వైద్యులను సంప్రదించండి. డబ్బులు మళ్లీ సంపాదించుకోవచ్చు.. కానీ ప్రాణం అలా కాదుగా..!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version