సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత… జనాలు అనవసర విషయాల మీద పెట్టిన శ్రద్ధ.. పనికొచ్చే విషయాల మీద పెట్టడం లేదు అనే ఆరోపణలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఏపీలో ఒక పోస్ట్ బాగా వైరల్ అయింది. అది ఏంటీ అంటే… “రాజ్ భవన్ వద్దకు గ్రే హౌండ్స్ బలగాలు. రాత్రికి రాత్రి రాజధానుల అంశం బిల్లు పాస్ అయ్యే అవకాశం…?” అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
దీనిపై గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ స్పందించారు. సోషల్ మీడియాలలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని ఆయన స్పష్టం చేసారు. ఎవరో ఇటువంటి రూమర్లు కావాలి అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటువంటి రూమర్ల లను ప్రచారం చేసే వారిపై, ఫార్వార్డ్ చేసే వారిపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. రాజ్ భవన్ వద్దకు ఎటువంటి బిల్లు లు రాలేదు అని ఎస్పీ స్పష్టం చేసారు.