కుక్కల ఆహారం ఐదు రోజులు తింటే.. రూ. 5 లక్షలు ఇస్తామంటున్న కంపెనీ..!

-

కుక్కలకు పెట్టే ఆహారం..5రోజుల పాటు తింటే.. రూ. 5లక్షలు ఇస్తారట. ఓ కంపెనీ చేసిన ఆఫర్ ఇది. బ్రిటన్ లో ఓమ్మి అనే కంపెనీ ఉంది. ఈ సంస్థ..కుక్కలకోసం.. తయారుచేసిన రకరకాల ఆహారాన్ని తిని టేస్ట్ ఎలా ఉంది చెప్పడానికి ఓ వ్యక్తికోసం చూస్తుంది. తింటే సరిపోదండోయ్.. ఒక్కో ఐటమ్ తిని.. దాని టేస్ట్ ఎలా ఉందో రివ్యూ రాయాలి. అది తిన్నప్పుడు మూడ్ ఎలా ఉంది, డైజెషన్ అవుతుందా లేదా అని కూడా చెప్పాలట. ఈ క్రేజీ జాబ్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బ్రిటన్‌లో ఓమ్నీ (OMNI) అనే కంపెనీ ఉంది. ఈ సంస్థ… తమకు ఓ వ్యక్తి కావాలి అంటోంది. ఆ వ్యక్తి.. 5 రోజుల పాటూ కుక్క ఆహారాన్ని తింటే… తాము £5,000 (దాదాపు రూ.5 లక్షలు) ఇస్తామని ప్రకటించింది. ఈ జాబ్ ఆఫర్ పొందిన వారు… కుక్కల కోసం కొత్తగా తయారుచేసిన రకరకాల ఆహారాన్ని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. తింటున్నప్పుడు ఎలా అనిపించిందో రిపోర్ట్ లో రాయాలట. తిన్న తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయని అనిపించింది, మూడ్ ఎలా ఉంది, మూత్ర విసర్జన ఎలా ఉంది అనేవి వివరించాలి.

ఓమ్నీ కంపెనీ మొక్కల ఆధారిత కుక్కల ఆహారం తయారుచేస్తోంది. చిలకడదుంపలు, పప్పులు, బ్రౌన్ రౌస్, గుమ్మడికాయ, బ్లూబెర్రీస్, బఠాణీలు, క్రాన్ బెర్రీస్ వంటి వాటితో ఆహారం తయారుచేస్తోంది. ఈ ఉద్యోగానికి అర్హతలంటూ ప్రత్యేకంగా ఏం లేవు. దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు… తమకు ఏవైనా అలర్జీలు ఉంటే… ముందే చెప్పాలి. కుక్కల ఆహారం తినేందుకు తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని రాసి ఇవ్వాలట. ఈ ఉద్యోగం భారతీయులకు సెట్ కాదు. ఎందుకంటే… దీనికి అప్లై చేసుకునే వ్యక్తి బ్రిటన్ వాసి మాత్రమే అయివుండాలనే కండీషన్ ఉంది. వయసు 18 ఏళ్లు లేదా అంతకుమించి ఉండాలి. ఉద్యోగంలో చేరిన వారికి రకరకాల ఆహారాలు ఇస్తారు. అలాగే… అవసరమైతే డైటీషియన్‌ని కలిసే ఛాన్స్ ఇస్తారు.

ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు శివ కుమార్ మాట్లాడుతూ..”మేము ఓ మనిషిని రిక్రూట్ చేసుకోవాలి అనుకున్నాం. ఆ వ్యక్తి కుక్కల కోసం తయారుచేసే కొత్త ఆహార ఉత్పత్తుల్ని టేస్ట్ టెస్ట్ చెయ్యాల్సి ఉంటుందన్నారు. తాము తయారు చేసే ఆహారాలను ఎవరైనా తినగలరని… వేరే సంస్థలో చేసే ఆహారాలను ఎవరూ తినలేరని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి అలా టేస్ట్ చేయడానికి కూడా జాబ్స్ ఆఫర్ చేస్తున్నారనమాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version