ఆలీకి కాబోయే అల్లుడు బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

-

ప్రముఖ స్టార్ కమెడియన్ ఆలీ ఇటీవల తన కూతురికి అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిపించారు. ఇక అయితే అందుకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను ఆలీ భార్య జుబేదా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇక ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా కాబోయే నూతన వధూవరులకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఆ ఫోటోలు వైరల్ అవుతూ ఉండగా అల్లుడు చాలా బాగున్నాడు.. ఇక ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు తెగ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు..

ఇక తాజాగా ఆలీ అల్లుడు గురించి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది.. ఆలీ అల్లుడు బాగా సంపన్నుడే అని సమాచారం. అంతేకాదు అతడికి ప్రజాసేవ అంటే చాలా ఇష్టమని , వాళ్లు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేదవారికి సహాయం చేస్తూ ఉంటారని , సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈయనది చాలా సెన్సిటివ్ క్యారెక్టర్ అని అలాగే చాలా సైలెంట్ గా ఉంటారు అని, తన పని తాను చేసుకుపోతారని కూడా తెలుస్తోంది. అల్లుడు క్యారెక్టర్ విషయంలో ఆలీ చాలా అదృష్టవంతుడని ఒక మంచి వ్యక్తిని ఇంటికి అల్లుడుగా తీసుకురాబోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి కొంతమంది ఏమో ఆలీ మంచితనమే తన ఇంటికి ఒక మంచి అల్లుడిని తీసుకురాగలిగింది. ఇక వారి కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఇక ఆలీ జుబేదా దంపతుల పెద్ద కూతురు నిశ్చితార్థం వేడుకలను చాలా ఘనంగా జరిపించడంతో ప్రతి ఒక్కరు ఎంగేజ్మెంట్ ఇంత బాగా జరిపించారు అంటే ఇక పెళ్లి ఏ రేంజ్ లో జరిపిస్తారో అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ నిశ్చితార్థానికి ఆలీ బంధువులతో పాటు సన్నిహితులు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version