సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్ కి సూచించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆకాశం పై ఉమ్మేస్తే నీ మీదే పడుతుంది చంద్రబాబు అంటూ మండిపడ్డారు. టిడిపి వాళ్ళు అబద్ధపు ప్రచారాలతో, అసత్య ప్రచారాలతో ఎలా ప్రచారం చేస్తున్నారో దానికి పదింతలు ప్రచారం చేయగల సామర్థ్యం నా వద్ద ఉందని అన్నారు. పరిధులు దాటవద్దు అని చంద్రబాబు నాయుడు,లోకేష్ కి వార్నింగ్ ఇస్తున్నాం అని అన్నారు విజయసాయి.
మీరు సోషల్ మీడియాలో అసభ్య పదజాలం వాడటం మానేస్తే మేము మానేస్తామని అన్నారు. వైసీపీ పార్టీపై బురద జిల్లాలన్న ఆలోచనలను మానుకోవాలని సూచించారు. ఎదుటి వారిపై బురదజల్లి ఆనందపడే వారిలో చంద్రబాబును మించిన వారు ఉండరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడాన్ కంపెనీతో వైసీపీ ప్రభుత్వానికి లింకులు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో చేసే ప్రచారం పై ఆయన మండిపడ్డారు.