భార‌త్‌లో శ‌వాల‌తో రోడ్ల‌పై క్యూ క‌ట్ట‌డం దారుణం.. క్రికెట‌ర్ వార్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

ప్ర‌స్తుతం ఇండియాలో సెకండ్ వేవ్ ఎంత‌లా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఆక్సిజ‌న్ అంద‌క ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే రోడ్ల‌పై అంత్య‌క్రియ‌ల కోసం వెయిటింగ్ కూడా చేస్తున్నారు. ఇంత‌లా ప‌రిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఇండియాలో క‌రోనా ప‌రిస్థితుల‌పై డేవిడ్ వార్న‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఎన్నో అడ్డంకులను దాటుకుని ఆస్ట్రేలియాలోని త‌న ఇంటికి చేరిన‌క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఓ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న కామెంట్లు చేశాడు. ఐపీఎల్ ఆడుతున్న‌ప్పుడు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి అంత్య‌క్రియ‌లు నిర్వహించేందుకు కుటుంబ స‌భ్యులు రోడ్ల‌పై లైన్లు క‌ట్టడం చూశానని.. నిజంగా దారుణ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

అలా వారిని చూశాక‌.. రాత్రి నిద్ర ప‌ట్టేది కాద‌ని తెలిపాడు. ఇండియాలో ఆక్సిజన్ అంద‌క ప్రజలు చ‌నిపోయారంటూ చెప్పారు. ఇలాంటి క‌ష్ట స‌మ‌యంలో ఐపీఎల్‌ను ర‌ద్దు చేసి బీసీసీఐ స‌రైన నిర్ణయం తీసుకుంద‌ని చెప్పాడు. అయితే ఆట‌గాళ్ల‌మంతా అక్క‌డి నుంచి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లిపోతామా అని ఎదురు చూశామ‌ని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version