ఆ విషయంలో నాగార్జున కంటే ఆయన వారసులే మేలా..?

-

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా మంచి చెడు కలిసి పంచుకుంటూ ఉంటారు. ఎవరు ఎలాంటి కష్టాలలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తూ ఉంటారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది నటీనటులు సైతం సహాయం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నారు. ఎవరు మరణించినా కూడా చివరి చూపు చూడడానికి అసలు వెళ్ళలేదు నాగార్జున. దీంతో నాగార్జున అభిమానులు అక్కినేని అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు.

నాగార్జున ఇలా ప్రవర్తించడానికి కారణం తెలియదు కానీ ఒక విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మొన్న ఆ మధ్య కృష్ణ గారు చనిపోయినప్పుడు నాగార్జున రాకపోవడం పై మీడియాతో పలు రకాలుగా వార్తలు వినిపించాయి. అక్కినేని కుటుంబంలో నాగేశ్వరరావు మరణించినా.. ఆయన భార్య అన్నపూర్ణమ్మ మరణించినా ఎంతోమంది వందలలో.. వేలలో అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం తరలివచ్చింది. కానీ నాగర్జున ఎందుకు సినీ సెలబ్రిటీలు మరణించినా.. ఆఖరి చూపు చూడడానికి వెళ్లడం లేదు అనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో తలెత్తుతోంది.

కానీ ఇతర ఫంక్షన్లకు, పార్టీలకు మాత్రం నాగార్జున కచ్చితంగా హాజరవుతూ ఉంటారని చెప్పవచ్చు. కానీ నాగార్జున వెళ్లకపోయినా ఆయన కుమారులు నాగచైతన్య , అఖిల్ మాత్రం కచ్చితంగా ఆ కుటుంబాలను పరామర్శించడానికి వెళుతూ ఉంటారు. కానీ కేవలం నాగార్జున దాసరి నారాయణరావు భార్య పద్మ చనిపోయినప్పుడు.. హరికృష్ణ చనిపోయినప్పుడు మాత్రమే ఆయా కుటుంబాలను పరామర్శించారు. మరి ఇతర కుటుంబాలను కూడా నాగార్జున పరామర్శించడానికి వెళ్లలేదు కానీ ఈ విషయం మాత్రం అభిమానులలో సందేహంగానే మిగిలిపోతుంది .మరి ఈ విషయంపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version