భారతదేశ ఘనత అన్ని దేశాలలో విస్తరిస్తోంది. భారత సంతతికి చెందిన ఎందరో ప్రముఖులు అనేక దేశాలలో ముఖ్యమైన విభాగాలలో పైస్థాయి ఉద్యోగస్తులుగా చేస్తున్నారు.ఇప్పుడు కరోనా మహమ్మారి నేపథ్యంలో అనేక దేశాలు వ్యాక్సిన్ తయారు చేసే ప్రక్రియను మొదలు పెట్టాయి. ఇప్పటికే రష్యా చివరి ట్రయల్స్ లో ఉంది. ఆ వ్యాక్సిన్ తయారు చేసే బృందంలో భారతీయ సంతతికి చెందిన శాస్త్రజ్ఞుడు ఉండడం భారత దేశానికే గర్వకారణం.
అదేవిధంగా ఇప్పుడు భారతీయ గౌరవం మరింత పెరిగేలా సింగపూర్ నగర హైకోర్టు జడ్జి గా భారత సంతతి జుడిషియల్ కమిషనర్ దేదార్ సింగ్ గిల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం సభలో దేదార్ సింగ్ గిల్ చేత అధ్యక్షుడు హలీమా యాకోబ్ ప్రమాణస్వీకారం చేయించారు.దేదార్ సింగ్ గిల్ ప్రస్తుత వయసు ఉ 61 ఏళ్ళు.. ఆయన 2018లో సుప్రీంకోర్టు బెంచ్ లో జాయిన్ అయ్యారు. అక్కడే జుడిషియల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి.. తన న్యాయ నైపుణ్యత తో ఎన్నో కేసులను అత్యంత సులభంగా తీర్చి దిద్దారు.