ఇండస్ట్రీ ఈ పొజిషన్ కి రావడానికి.. అల్లు అరవింద్ – రాజమౌళి ఆనాటి నిర్ణయమేనా..?

-

తెలుగు చిత్ర పరిశ్రమంలో మోస్ట్ కమర్షియల్ జీనియస్ గా అల్లు అరవింద్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నిర్మించిన సినిమాల్లో 80 శాతానికి పైగా సినిమాలు కమర్షియల్ సక్సెస్ అందుకున్నవే.. హీరో స్టార్ డమ్ మరియు దర్శకుడు ప్రతివ ఆధారంగా సినిమాపై ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక అలా ఆయన నమ్మకంతోనే మగధీర సినిమాకు అప్పట్లోనే ఏకంగా రూ. 40 కోట్లు ఖర్చు పెట్టడం వల్లే ఈరోజు ఇప్పుడు మన తెలుగు సినిమా ఇలా ఉంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే మగధీర సినిమాను బాబోయ్ అంత ఖర్చు చేయలేను రూ.20 కోట్లలో తీయమని రాజమౌళితో చెప్పి ఉంటే కచ్చితంగా రాజమౌళి ఆ తర్వాత అద్భుతమైన సినిమాలను చేసేవారు కాదు.

ఇటీవల ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన అల్లు అరవింద్.. ఎన్నో విషయాలను పంచుకోవడం జరిగింది. రెండు పార్టులుగా టెలికాస్ట్ అయిన ఈ కార్యక్రమానికి సంబంధించి మొదటి ఎపిసోడ్లో అల్లు అరవింద్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ .. మా నాన్నగారు ఎప్పుడూ కూడా నన్ను బాహాటంగా పొగిడింది లేదు.. కానీ ఒక సంఘటన మాత్రం నాకు బాగా గుర్తుంది. నాన్నగారు చిన్నప్ప దేవర నిర్మాణంలో ఒక సినిమా చేయాల్సి ఉండగా.. రూ. 12 వేలకు నటించాలని నిర్మాత అన్నారు. కానీ నాన్నగారు రూ.15000 పారితోషకం ఇస్తేనే నటిస్తాను అన్నారు. కానీ వారిద్దరి మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో సినిమా ప్రారంభం సమయంలో రూ.12000 పారితోషకం తీసుకొని , మళ్ళీ ఆయనకు ఇచ్చేయండి. ఆ మొత్తం కి వడ్డీతో సహా సినిమా పూర్తి అయిన తర్వాత రూ.15,000గా మీకు ఇవ్వమనండి అంటూ అల్లు అరవింద్ అప్పట్లో అల్లు రామలింగయ్యకు ఫైనాన్షియల్ గా సలహా ఇచ్చారట.

ఇక ఇదే విషయాన్ని చిన్నప్ప దేవర్ వద్దకు అల్లు రామలింగయ్య గారు తీసుకువెళ్లి చెప్పగా.. అద్భుతమైన ఐడియా నేను మీ అబ్బాయిని కలవాలి అనుకుంటున్నాను అని చెప్పి.. ఆయన నన్ను కలిసి అభినందించారు అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు ఇక చిన్నప్పటినుండే ఫైనాన్షియల్ గా అంతగా ఆలోచించేవాడు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయగలిగాడు. మగధీర విషయంలో కూడా ఆ రోజు కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడం వల్ల నేడు బాహుబలి , ఆర్ఆర్ఆర్ సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లను దాటించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version