తెలంగాణలో ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షలు

-

తెలంగాణలో ఎల్లుండి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

మరోవైపు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులంతా పరీక్షల సమయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. పరీక్షల్లో పాసవుతామో లేదోనని కొందరు.. అనుకున్న మార్కులు సాధిస్తామో లేదోనని మరికొందరు ఆందోళన చెందుతుంటారు. అధ్యాపకులు, తల్లిదండ్రులు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక ఇంకొందరు బాగా స్ట్రెస్​కు గురవుతుంటారు. అలాంటివేం పెట్టుకోకండి. పాసయ్యే మందం చదివినా సరిపోతుంది. అలాగని నిర్లక్ష్యం చేయకండి. మార్కులే జీవితం కాదు. హాయిగా ప్రశాంతంగా పరీక్షలు రాయండి.’ అని మంత్రి అన్నారు.

ఈ ఏడాది 9.47 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్ష రాయబోతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థులు.. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని వెల్లడించారు. ఒత్తిడి లేకుండా హాయిగా చదివి.. జాలీగా పరీక్షలు రాయమని విద్యార్థులకు మంత్రి సూచనలిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version