ఇంటర్ విద్యార్థినికి మత్తు పానీయం తాగించి దారుణం… నగ్న చిత్రాలు తీసి మరీ !

-

ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.ఇంటర్ విద్యార్ధి నీతో మత్తుపానీయం తాగించి నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.స్నేహితురాలి పుట్టినరోజుకు వచ్చిన విద్యార్థినితో మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి..ఆపై ఆమెను వివస్త్రను చేసి ఫోటోలు వీడియోలు తీశాడు విద్యార్ది.పోలీసుల కథనం ప్రకారం..మండలంలోని ఓ గ్రామానికి చెందిన దూదేకుల నాగూర్ మీరావలి(19) డిప్లమో చదువుతున్నాడు.మరో గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని స్నేహితురాలి పుట్టినరోజు కోసమని మార్కాపురం వచ్చింది.ఆమెతో ఇదివరకే పరిచయం ఉండడంతో మీరావలి ఆమెతో మాటలు కలిపాడు.

young teenager girl hand using mobile phone or smartphone on gray wall background

ఆ తర్వాత కూల్ డ్రింక్ తాగుదాం అనితీసుకెళ్లాడు.అందులో మత్తు మందు కలిపి ఆమెకు ఇచ్చాడు.అది తాగిన తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోయింది.ఆ వెంటనే ఆమెను వివస్త్రగా మార్చిన మీరావలి తన మొబైల్ ఫోన్ లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు.వాటిని చూసిన మీరావలి స్నేహితుడు రసూల్(22) వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.అవి వైరల్ అయి బాధిత విద్యార్థిని తల్లిదండ్రులఅవి దృష్టికి చేరాయి.దీంతో వారు పెద్దదోర్నాల చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు మీరావలి, రసూల్ ను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version