ఛాన్సే లేదు.. సీఎం పదవీ ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు..!

-

బీజేపీ ప్రకటించిన బీసీ సీఎంపై ఆ పార్టీ కీలక నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. నన్ను బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. నేను ఒక్క గజ్వేల్, హుజూరాబాద్ లో గెలిస్తే సీఎం అవుతానా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ 70 గెలిస్తే తప్ప తాను సీఎం అయ్యే ఆస్కారం లేదని అన్నారు.

కాగా, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని చేస్తామని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీసీ ఓటర్లు అధికంగా ఉండటంతో ఆ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకొని ఓట్లు రాబట్టేందుకు బీసీ వ్యక్తి సీఎం అని బీజేపీ అనౌన్స్ చేసింది. ప్రచారంలో సైతం బీజేపీ ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. బీజేపీ అగ్ర నేతలు సైతం ప్రచార సభల్లో ఈ అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు అన్యాయం చేస్తే బీజేపీ మాత్రం ఎక్కువగా బీసీలకే టికెట్లు ఇస్తుందని, అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ప్రచారం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version