ఏపీ బాగుప‌డుతుంటే ఈ నేత‌లు చూడ‌లేక‌పోతున్నారా…!

-

నిన్న మొన్న‌టి వ‌రకు రాష్ట్రంలో ప‌రిస్థితి ఒకింత నిల‌క‌డ‌గా ఉంది. క‌రోనా మ‌హ‌మ్మారి విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను ఎవ‌రు కొనియాడినా .. ఎవ‌రు విమ‌ర్శించినా. స‌గ‌టు పౌరులు మాత్రం మెచ్చుకుంటున్నారు. ఈ ముందు జాగ్ర‌త్త‌ల విష‌యంలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరు కార‌ణంగా.. దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున క‌రోనా రోగులు విస్త‌రిస్తున్నా.. ఏపీలో మాత్రం నిల‌క‌డ‌గా ఉంది. అయి తే, ఈ ప‌రిస్థితి ప‌క్క‌నే ఉన్న తెలంగాణ‌లో కూడా క‌నిపించ‌డం లేదు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితికి ఇక్క‌డి నాయ కులు, ప్ర‌తిప‌క్ష నేత‌లు స‌హ‌క‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.

కానీ, దీనికి విరుద్ధంగా మ‌రీ చౌక‌బారు రాజ‌కీయాలు చేస్తున్నారు టీడీపీ, బీజేపీ నేత‌లు. టీడీపీ విజ‌య‌వాడ ఎంపీ కేశినేనినాని తాను మ‌హామేధావిన‌ని చెప్పుకొంటారు. మ‌రి ఆ మేధావి త‌నం.,. ఇప్పుడు కూడా విమ‌ర్శ లు చేసేందుకే ప‌నిచేస్తుండ‌డం దారుణంగా ఉంది. మ‌న రాష్ట్రంలోకి ఇత‌ర ప్రాంతాల వారిని అనుమ‌తించ ని కార‌ణంగా ఇక్క‌డి నాలుగున్నర కోట్ల మంది ఒకింత కంటిపై నిద్ర పోతున్నారు. కానీ, ఇప్పుడు తెలంగాణ నుంచి వ‌చ్చే నాలుగు వేల మంది విద్యార్థుల‌ను అనుమ‌తించాల‌ని లేక‌పోతే.. జ‌గ‌న్ త‌ల వెయ్యి వ‌క్క‌లు అయిపోతుంద‌ని రాజ‌కీయ శాప‌నార్థాలు పెడుతున్నారు నాని.

అదే స‌మ‌యంలో కేర‌ళ సీఎంను క‌మ్యూనిస్టుల పాల‌న‌ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. అక్క డ కేర‌ళ వాసుల‌ను క‌ర్ణాట‌క నుంచి భారీ ఎత్తున ర‌ప్పించార‌ని ఇలాంటి ఆద‌ర్శం ఏపీకి ఎందుకులేద‌ని అంటున్నారు. అయ్యానానీ గారు. . కేర‌ళ‌కు ఏపీకి న‌క్క‌కు నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉంది. అక్క‌డ ప్ర‌భుత్వానికి ఇబ్బడిముబ్బ‌డి నిధులు ఉన్నాయి. పైగా అంద‌రూ ఎడ్యుకేటెడ్‌. డాక్ట‌ర్లు ఎక్కువ‌. సో.. అక్క‌డ జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు.

అదేసూత్రం ఇక్క‌డ పాటిస్తే.. ఈ పాటికి ఓ ల‌క్ష మంది వైర‌స్ బారిన ప‌డేవారు. అయితే, మీరు అభిమానించే పీఎం మోడీనే ఎక్క‌డివారు అక్క‌డ ఉండాల‌ని చెబుతూ.. రైళ్ల‌ను కూడా బంద్ చేయిస్తే.. మీరేమో.. జ‌గ‌న్కు సుద్దులు చెబుతున్నారు. ఏం రాజ‌కీయమండీ?  అదే బాబు సీఎం గా ఉండి ఉంటే.. ఇలానే చెప్పేవారా? అంటున్నారు సోష‌ల్ మీడియా జ‌నాలు. మ‌రి నాని ఎలా ఫైర్ అవుతారో చూడాలి. ఆయ‌న ఫైర్ బ్రాండ్ క‌దా?!

Read more RELATED
Recommended to you

Exit mobile version