ఈట‌ల‌ను టార్గెట్ చేసిన ఆ ముగ్గురు.. రేసులో గెలుస్తారా?

-

ఎన్నో మ‌లుపుల త‌ర్వాత ఈట‌ల రాజేంద‌ర్ త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయ‌న్ను బ‌ర్త‌ర‌ఫ్ చేసిన త‌ర్వాత వ‌రుస‌గా కాంగ్రెస్‌, బీజేపీ నేత‌ల‌ను క‌లిశారు. దీంతో అస‌లు ఆయ‌న ఏ పార్టీలో చేర‌బోతున్నారంటూ అంతా ఆస‌క్తిగా ఎదురుచూశారు. అయితే ఫైన‌ల్‌గా ఆయ‌న బీజేపీలోకి వెళ్ల‌డం ఖాయం అయింది.

అయితే ఆయ‌న ఇప్పుడు టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ప‌ద‌వికి మ‌రో రెండు లేదా మూడు రోజుల్లో రాజీనామా చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక త‌ప్ప‌నిస‌రి తెలుస్తోంది. కాబట్టి ఇప్పటి నుంచే టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు అమలు చేస్తోంది.

హుజూరాబాద్‌లో ఎలాగైనా గెలిచి స‌త్తా చాటాల‌ని భావిస్తోంది. దీని కోసం మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈట‌ల వెంట ఎవ‌రినీ న‌డ‌వ‌నీయ‌కుండా చేస్తున్నారు. అవ‌స‌ర‌మైతే బేర‌సారాలు చేసి త‌మ‌వైపు తిప్పుకుంటున్నారు. మ‌రి ఈట‌ల‌ను దెబ్బ కొట్ట‌డంలో వీరు ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి. కేసీఆర్ కూడా వీరి ముగ్గురిపైనే హుజూరాబాద్ గెలుపు భారం మోపారంట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version