దిశ కేసులో బయటపడుతున్న సంచలన నిజాలు..

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. దిశ లివర్‌లో లిక్కర్‌ను ఫోరెన్సిక్‌ నిపుణులు గుర్తించారు. దిశ కేసులో పోలీసులకు మరో ఆధారం బలంగా మారింది. అంటే అత్యాచారానికి ముందు నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం తాగించారన్న విషయం దీనిని బట్టి అర్థమవుతోంది. నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీస్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ.. అత్యాచారం సమయంలో నిందితులు ఆమె నోట్లో బలవంతంగా మద్యం పోసినట్టు తెలిపారు.

వాంగ్మూలంలోనూ నిందితులు ఇదే విషయం చెప్పినట్టు పోలీసులు రిమాండ్ డైరీలో సైతం పేర్కొన్నారు. ఇప్పుడా విషయాన్ని ఫోరెన్సిక్ నివేదిక ధ్రువీకరించింది. ఇక రన్‌వే 44 వైన్స్‌లో నిందితులు మద్యం కొనుగోలు చేసినట్టు పోలీసులు సీసీఫుటేజ్ కూడా సేకరించారు. కాగా, గత నెల 27వ తేదీ రాత్రి శంషాబాద్‌ సమీపంలోని తొండుపల్లి సర్వీస్‌ రోడ్డులోని చటాన్‌పల్లి వద్ద దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి.. హత్య చేసిన విషయం తెలిసిందే. మరోవైపు దిశ ఎన్‌కౌంటర్‌ నిందితుల మృతదేహాల అప్పగింతపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version