మళ్లీ తప్పులో కాలేసిన బైడెన్‌.. ఈసారి ఏమన్నారంటే..!

-

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు రోజురోజుకు వ్యతిరేకత ఎక్కువవుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆయన అనర్హుడంటూ సొంత పార్టీలో ముసలం మొదలైంది. ఇక మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో డిబేట్ తర్వాత బైడెన్పై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఆయన మరోసారి తప్పులో కాలేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పుతిన్‌ అంటూ ఆయన మరోసారి పొరబాటు వ్యాఖ్యలు చేశారు.

రెండోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన బైడెన్‌పై ఇంటాబయట తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆయనపై వ్యతిరేకత మరింత ఎక్కువవుతోంది. నాటో దేశాల వార్షిక సదస్సు తర్వాత బైడెన్‌ మీడియాతో మాట్లాడూతు.. ఈ సందర్భంగా అధ్యక్ష రేసు నుంచి మీరు వైదొలగితే కమలా హ్యారిస్‌…ట్రంప్‌ను ఓడించగలరని భావిస్తున్నారా..? అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు .. అధ్యక్షుడిగా పనిచేసే అర్హత ఉపాధ్యక్షుడు ట్రంప్‌నకు లేకుంటే.. ఆయన్ని ఆ పదవికి ఎంపిక చేసేవాణ్నే కాదన్నారు.  ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌కు బదులు…ట్రంప్‌ అని అన్నారు. మీడియా సమావేశానికి ముందు నాటో సభ్యదేశాల ప్రతినిధులకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పరిచయం చేసిన బైడెన్‌…ఆ సమయంలో జెలెన్‌స్కీని ఆహ్వానిస్తూ అధ్యక్షుడు పుతిన్‌ అని సంబోధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version