సెకన్​లో 150 సినిమాలు డౌన్​లోడ్.. అత్యంత ఫాస్టెస్ట్ ఇంటర్నెట్​ను ఆవిష్కరించిన చైనా

-

ఒక్క సెకనులో 150 సినిమాలు డౌన్​లోడ్ చేసుకోవచ్చు. అది కూడా హెచ్​డీ మూవీస్. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. అంత ఫాస్ట్​ నెట్​వర్క్​ ఉంటుందా అని అనుమానం కలుగుతుంది కదా. కానీ ఇది నిజమే. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ ఉంది. టెక్నాలజీలో తరచూ ఏదో సంచలనం సృష్టించే చైనా ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

చైనా కంపెనీలు తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఇంటర్నెంట్ నెట్​వర్క్​ను ఆవిష్కరించాయి. ఈ నెట్‌వర్క్‌ సెకనుకు 1.2 టెరాబైట్స్‌ వేగంతో డేటాను ట్రాన్స్‌మిట్‌ చేయగలదట. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ప్రధాన ఇంటర్నెట్‌ రూట్స్ కంటే ఇది దాదాపు 10 రెట్లు వేగంగా పనిచేస్తోందట. సౌత్ చైనా పోస్టు పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. సింగ్వా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్‌, హువావే టెక్నాలజీస్‌, సెర్నెట్‌ కార్పొరేషన్‌ సమష్టిగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశాయట. 150 HDచిత్రాలతో సమానమైన డేటాను కేవలం ఒక్క సెకన్‌లో పంపించగలదని.. భవిష్యత్​లో మరింత వేగమైన నెట్​వర్క్​ను రూపొందించేందుకు ప్రయత్నిస్తామని.. హువావే టెక్నాలజీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వాంగ్‌ లీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version