ఔను.. చైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది : జిన్‌పింగ్‌

-

ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన చైనా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. గత కొంతకాలంగా ఆర్థికంగా డీలా పడి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కరోనా విలయం ముగిసిన తర్వాత చైనా ఎన్నో అర్థిక సవాళ్లు ఎదుర్కొంటోందని ఆ దేశ అగ్రనేతలు ఇప్పటికే పలుమార్లు చెప్పినా ఆ దేశాధినేత జిన్పింగ్ మాత్రం దీనిపై నోరు మెదపలేదు. అయితే మొదటి సారిగా ఆయన ఈ అంశంపై పెదవి విప్పారు. తమ దేశంలో ఆర్థిక సవాళ్లు ఉన్న మాట నిజమేనంటూ ఆయన అంగీకరించారు.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జిన్‌పింగ్‌ చైనా ఆర్థిక పరిస్థితులను నేరుగా ప్రస్తావించడం గమనార్హం. దేశంలోని వాణిజ్య, వ్యాపారాలు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయని ఆయన చెప్పారు. నిరుద్యోగులు ఉపాధి వేటలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉద్యోగాలు లేక, కనీస అవసరాలు తీరక కొంతమంది బాధపడుతున్నారని జిన్పింగ్ అంగీకరించారు. ఈ ఇబ్బందుల గురించి తాను కూడా ఆలోచిస్తున్నానని ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలోకి తెచ్చేలా వేగవంతమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన మాటిచ్చినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version