స్వయంగా యుద్ధ ట్యాంకు నడిపిన కిమ్‌

-

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. యుద్ధ సన్నద్ధత, ఆయుధాల ప్రయోగ పరీక్షలతో నిత్యం వార్తల్లో నిలిచే కిమ్ ఈసారి స్వయంగా యుద్ధ ట్యాంకును నడిపారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ పేర్కొంది. వాటికి సంబంధించిన ఫొటోలు కూడా విడుదల చేసింది.

తరచూ ఆయుధాల ప్రయోగాలతో ఉత్తర కొరియా అధినేత కిమ్.. అగ్రరాజ్యం అమెరికా, పొరుగుదేశం దక్షిణ కొరియాకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఎప్పటికప్పుడు సైనిక సన్నద్ధతను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా సైనికుల్లో స్ఫూర్తి నింపేందుకు స్వయంగా కిమ్‌ రంగంలోకి దిగి యుద్ధ ట్యాంకును నడిపారు. ఇటీవల అభివృద్ధి చేసిన ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ట్యాంకుల’ పని తీరును సైనికులతో ఆయన పర్యవేక్షించినట్లు కేసీఎన్ఏ తెలిపింది. అమెరికా, దక్షిణ కొరియా వార్షిక సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా తమపై ఆక్రమణకు సన్నాహకంగా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిస్పందనగా ట్యాంకులతో తమ పాటవాన్ని ప్రదర్శిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version